ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఖాయమైనప్పటి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలిపోతుందని చాలా వార్తలు వచ్చాయి. కొంత మంది నిర్మాతలు చెన్నై లేదా వైజాగ్ కు చిత్ర పరిశ్రమ వెళుతుందని భావించారు. భవిష్యత్తులో అక్కడ చాలా అభివృద్ధి ఉంటుందని వారు అనుకున్నారు.
ఇదే ప్రశ్నను నాగార్జున ను ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో అడిగినప్పుడు ‘అన్నపూర్ణ స్టూడియోస్ 1974 లో హైదరాబాద్ లో స్దాపించారు. 1990 కు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి చిత్ర పరిశ్రమ ఇప్పుడే ఎక్కడికి వెల్లదని అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాలు నిర్మించాలంటే చాలా నైపుణ్యం ఉన్న టెక్నీషియన్స్, ప్రతిభ గల పనివారు, మంచి స్టూడియోస్ కావాలి అవన్నీ కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాయి’ అని తెలిపారు.
మే 23 న విడుదల కానున్న మనం చిత్రం కోసం నాగార్జున వేచిచూస్తున్నారు. ఏఎన్నార్, నాగచైతన్య, సమంతా, శ్రియ లు నటించిన ఈ చిత్రానికి విక్రం కుమార్ దర్శకత్వం వహించారు.
