ఫిల్మ్ ట్రివియా : మొదటిగా తెలుగు చిత్రం చేసి ఇపుడు హిందీలో ఫేమస్ అయిన నటి ఎవరో తెలుసా?

Published on Sep 24, 2020 1:02 pm IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, యాక్షన్ మేకింగ్, టెక్నిషీయన్స్ కు సంబంధించి ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈ రోజు మా ప్రశ్న ఏమిటంటే ఈ నటి ఎవరి ఇపుడు అందరికీ చాలా బాగా తెలుసు. బెంగళూర్ లో పుట్టిన ఈమె మొట్ట మొదటిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచే పరిచయం అయి ఇపుడు బాలీవుడ్ లో బిజీగా ఉంది. అలాగే పలు కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రెస్ లా నిలిచింది. మరి ఆ హీరోయిన్ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సరైన సమాధానాన్ని మేము తర్వాత రివీల్ చేస్తాము.


సమాధానం :

ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటంటే ఆ హీరోయిన్ మరెవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ రియా చక్రవర్తి. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ మొట్ట మొదటిగా తెలుగు చిత్రంలో నటించింది. అదే “తూనీగ తూనీగ” చిత్రం. అశ్విన్ సరసన నటించిన రియాకు అదే మొదటి చిత్రం తర్వాత ఆమె హిందీలో బిజీ అయ్యింది. ఇపుడు అక్కడి స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్యా ఘటనలో మరియు డ్రగ్స్ రాకెట్ లో పలు ఆరోపణలు ఎదుర్కొంటుంది.

సంబంధిత సమాచారం :

More