ఫిలింఫేర్ వ్యాఖ్యాతలుగా రాహుల్ & చిన్మయి

rahul-&-chinmayi
‘అందాల రాక్షసి’, ‘పెళ్లి పుస్తకం’ సినిమాల హీరో రాహుల్ రవీంద్రన్ వ్యాఖ్యాతగా మారుతున్నారు. 2014 సౌత్ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమానికి రాహుల్ యాంకరింగ్ చేస్తున్నారు. తన భార్య, గాయని అయిన చిన్మయితో కలసి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్టు ట్విట్టర్లో తెలియజేశారు. సమంత డబ్బింగ్ ఆర్టిస్టుగా చిన్మయి తెలుగులో పాపులర్ అయ్యారు. సంగీత ప్రియులకు ఆమె స్వరం అందరికి సుపరిచితమే. ఈ నవ దంపతుల మాటలతో కార్యక్రమానికి కొత్త కళ వస్తుంది అనడంలో సందేహం లేదు.

2014 ఫిలింఫేర్ అవార్డులపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ వంటి అగ్రహీరోలు నామినేట్ కావడంతో అభిమానుల చూపు ఫిలింఫేర్ పై పడింది. గత ఏడాది ఘన విజయం సాదించిన అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మిర్చి, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలు అతధిక విభాగాలలో నామినేషన్లు సొంతం చేసుకున్నాయి.

Exit mobile version