ఫైనల్ గా ఓటిటి లో ఆ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చిన ’12th ఫెయిల్’

ఫైనల్ గా ఓటిటి లో ఆ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చిన ’12th ఫెయిల్’

Published on Mar 5, 2024 1:17 AM IST

ఇటీవల బాలీవుడ్ లో తెరకెక్కిన యాక్షన్ బయోగ్రఫికల్ డ్రామా మూవీ 12th ఫెయిల్. ఈ మూవీలో విక్రాంత్ మాసే, మేధా శంకర్ హీరో హీరోయిన్స్ గా నటించగా విధు వినోద్ చోప్రా దీనిని తెరకెక్కించారు. మంచి అంచనాలతో కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ పెద్ద విజయం సొంతం చేసుకుంది. ప్రియాంషు ఛటర్జీ, సంజయ్ బిష్ణోయ్, హరీష్ ఖన్నా తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ కొన్నాళ్ల క్రితం ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయి అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

అయితే ఇప్పటివరకు కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈమూవీ తాజాగా తెలుగు సహా పలు ఇతర పాన్ ఇండియన్ భాషల్లో కూడా అందుబాటులోకి రావడం విశేషం. మరి ఇకపై ఇతర భాషల ఆడియన్స్ నుండి 12th ఫెయిల్ మూవీ ఏ స్థాయి రెస్సాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. శంతను మోయిత్ర సంగీతం అందించిన ఈ మూవీకి రండరాజన్ రామబద్రన్ ఫోటోగ్రఫి అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు