కేజ్రీగా అండ్ సూపర్ ఫన్ గా “కల్కి” స్క్రాచ్ ఎపిసోడ్ 4

కేజ్రీగా అండ్ సూపర్ ఫన్ గా “కల్కి” స్క్రాచ్ ఎపిసోడ్ 4

Published on May 18, 2024 9:36 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకోణ్ అలాగే దిశా పటాని హీరోయిన్, కీలక పాత్రల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ సై ఫై ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం “కల్కి 2898 ఎడి”. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ మొదటి నుంచి కూడా వినూత్న విధానాల్లో ప్రమోషన్స్ తో సినిమాని ఆడియెన్స్ లోకి తీసుకెళ్తున్నారు.

అలా సినిమా మేకింగ్ సంబంధించి ఆసక్తికర వీడియోలతో స్క్రాచ్ అంటూ కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలా ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో ఎపిసోడ్ 4 తో వచ్చారు. మరి ఇందులో ప్రభాస్ చెప్పిన బుజ్జి ఎవరో చాలా సేపు వైట్ చేయించి రివీల్ చేశారు.

తమ టీం అంతా ఎంతో కష్టపడి బుజ్జి అనే చిన్నపాటి రోబోట్ కి బాడీని తయారు చేసే పనిలో ఉంటే దానికోసం పని చేస్తున్న లోకల్ టు నాన్ లోకల్ టెక్నీషియన్స్ ని అది ఇరిటేట్ చేయడం మంచి సూపర్ ఫన్ గా కేజ్రీగా కూడా కనిపిస్తుంది. ఇక ఫైనల్ గా భైరవనే ఆ భాద్యత తీసుకొని కంప్లీట్ బాడీ రెడీ చేసాడు.

అయితే దీనిని ఈ మే 22న రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. సో మళ్లీ అప్పటి వరకు ఆగక తప్పదు. ఇంకా ఈ చిట్టి రోబోట్ కి కీర్తి సురేష్ ఇచ్చిన వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్ గా అదిరిపోయింది అని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ మే 22న ట్రీట్ ఎలా ఉంటుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు