టాలీవుడ్ అగ్ర నిర్మాత డి.వి.వి.దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయమవుతున్న భారీ ప్రాజెక్ట్ ‘అధీర’ పట్టాలెక్కడానికి సిద్ధమైంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సూపర్ హీరో కథను అందిస్తుండగా, శరణ్ కొప్పిశెట్టి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జనవరి 27 నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తన డెబ్యూ కోసం కళ్యాణ్ దాసరి నటన, డ్యాన్స్ మరియు యాక్షన్ లో విశేషమైన శిక్షణ తీసుకున్నారు. ప్రశాంత్ వర్మ మార్క్ మేకింగ్‌తో కళ్యాణ్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు.
2022లో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, ఇప్పుడు అన్నింటికీ తెరపడింది. హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ మొదలవుతుందని దర్శకుడు శరణ్ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ఎస్.జె. సూర్య విలన్‌గా నటిస్తుండటం విశేషం. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.కె.డి స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు.


