మొత్తానికి కదులుతున్న ‘విశ్వంభర’.. సైలెంట్ గా ఈ పనులు!

మొత్తానికి కదులుతున్న ‘విశ్వంభర’.. సైలెంట్ గా ఈ పనులు!

Published on Nov 11, 2026 12:03 PM IST

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన లేటెస్ట్ సినిమాల్లో ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్న లాంగ్ అవైటెడ్ ఫాంటసీ సినిమా విశ్వంభర కూడా ఒకటి. యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ భారీ విజువల్ ట్రీట్ విడుదల ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఈ సినిమా విడుదల ఎప్పుడు అనే క్లారిటీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది.

ఈ సినిమా ప్రస్తుతం సైలెంట్ గా డబ్బింగ్ పనులు ముగించేసుకుంటుంది. ప్రముఖ నటుడు ప్రవీణ్ ఈ సినిమా డబ్బింగ్ చెబుతున్నట్టు చేసిన పోస్ట్ ఇపుడు ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. సో మొత్తానికి విశ్వంభర కదులుతుంది అనుకోవచ్చు. కానీ ఆ విడుదల ఎప్పుడు ఏంటి అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేకపోవడం ఫ్యాన్స్ ని చాలా డిజప్పాయింట్ చేస్తుంది. ఇక ఈ చిత్రానికి కీరవాణి, గౌర హరి సంగీతం అందిస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు