మరోసారి థియేటర్స్ లోకి “హ్యాపీ డేస్”.. డేట్ వచ్చేసింది

మరోసారి థియేటర్స్ లోకి “హ్యాపీ డేస్”.. డేట్ వచ్చేసింది

Published on Mar 26, 2024 1:02 PM IST

టాలీవుడ్ కి యువ నటీనటుల్ని పరిచయం చేసి హిట్ కొట్టడంలో దర్శకుడు శేఖర్ కమ్ములకి ఒక ప్రత్యేక మార్క్ ఉంది. తన మొదటి సినిమా నుంచి కూడా ఇప్పటికీ తన సినిమాల్లో మ్యాజిక్ తో ఎంతగానో అలరించే తాను చేసిన హిట్ చిత్రాల్లో ఒక సమయంలో యూత్ అంతటినీ ఎంతగానో ప్రభావితం చేసిన సెన్సేషనల్ హిట్ చిత్రం “హ్యాపీ డేస్” కూడా ఒకటి. వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్, వెంకట్ తదితర యంగ్ నటీనటులు చేసిన ఈ చిత్రం భారీ వసూళ్లతో కూడా అదరగొట్టింది.

అయితే ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ దానికి ముందు ఈ చిత్రం థియేటర్స్ లో మరోసారి అలరించేందుకు సిద్ధం అయ్యింది. ఎప్పుడు నుంచో ఈ సినిమా రీ రిలీజ్ కోసం చూస్తున్న వారికి ఫైనల్ గా ఆ డేట్ రానే వచ్చింది. ఈ చిత్రాన్ని గ్లోబల్ సినిమాస్, అమిగోస్ క్రియేషన్, ఆసియన్ సినిమాస్ వారు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. మరి దీనికి గాను ఈ ఏప్రిల్ 12ని అయితే లాక్ చేశారు.

మరి అప్పుడు చూసిన వారు అప్పుడు మిస్ అయ్యి చూడాలి అనుకునేవారు అయితే ఈ చిత్రాన్ని చూడాలి అనుకుంటే ఈ డేట్ వరకు ఆగితే సరిపోతుంది. ఇక ఈ మ్యాజికల్ హిట్ కి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు