ఓటిటిలోకి వచ్చేసిన ‘సూపర్ మ్యాన్’.. సాహసాలు ఎందులో చూడొచ్చంటే!

ఓటిటిలోకి వచ్చేసిన ‘సూపర్ మ్యాన్’.. సాహసాలు ఎందులో చూడొచ్చంటే!

Published on Dec 11, 2025 2:17 PM IST

Superman

ఈ ఏడాదిలో హాలీవుడ్ ఆడియెన్స్ ని అలరించిన దానికి వచ్చిన పలు అవైటెడ్ చిత్రాల్లో సూపర్ హీరో జానర్ చిత్రం “సూపర్ మ్యాన్” కూడా ఒకటి. మార్వెల్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ గన్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి హైప్ నడుమ రిలీజ్ కి వచ్చింది. కానీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో టాక్ ని అయితే ప్రపంచ వ్యాప్తంగా అందుకోలేదు అయినప్పటికీ ఫ్యాన్స్ ని మాత్రం అంతగా నిరాశ పరచలేదు. ఇలా థియేటర్స్ నుంచి ఫైనల్ గా ఈ సినిమా ఓటిటిలో అలరించేందుకు వచ్చేసింది.

ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఒరిజినల్ ఇంగ్లీష్ లోనే కాకుండా మన తెలుగు డబ్బింగ్ లో కూడా నేటి నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. సో అప్పుడు మిస్ అయ్యి చూడాలి అనుకున్నారు వారు ఇప్పుడు సూపర్ మ్యాన్ చేసే సాహసాలు యాక్షన్ ని జియో హాట్ స్టార్ లో వీక్షించవచ్చు. ఇక ఈ సినిమాలో సూపర్ మ్యాన్ గా డేవిడ్ కోరేన్ స్వెట్ నటించగా విలన్ గా నికోలస్ హౌల్ట్ నటించాడు. అలాగే వార్నర్ బ్రదర్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు