ఫైనల్ గా కమల్ “థగ్ లైఫ్” ఆరంభం..!

ఫైనల్ గా కమల్ “థగ్ లైఫ్” ఆరంభం..!

Published on Jan 24, 2024 1:00 PM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన అనౌన్స్ చేసిన మరో చిత్రమే “థగ్ లైఫ్”. మరి అనౌన్సమెంట్ తోనే భారీ హైప్ లేపిన ఈ చిత్రం కోసం మూవీ లవర్స్ అయితే చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం పై మేకర్స్ ఇప్పుడు మరో సాలిడ్ అప్డేట్ ని అందించారు.

దీనితో ఈరోజు నుంచే సినిమా షూట్ స్టార్ట్ చేస్తున్నట్టుగా డే 1 షూట్ అంటూ మేకర్స్ అనౌన్సమెంట్ చేశారు. మరి దీనిపై సినిమాలో నటిస్తున్న నటీనటులపై ఇంట్రెస్టింగ్ వీడియో కూడా రిలీజ్ చేసి తెలియజేసారు. దీనితో మొత్తానికి ఈ అవైటెడ్ చిత్రం ఫైనల్ గా ఇప్పుడు మొదలైంది. ఇక ఈ భారీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తుండగా త్రిష, దుల్కర్ సల్మాన్, జోజు జార్జ్ తదితరులు నటిస్తుండగా కమల్, రెడ్ జెయింట్ సినిమాస్ మరియు మద్రాస్ టాకీస్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు