ఉత్కంఠ మధ్య బిగ్ బాస్ హౌస్ నుండి అతను అవుట్.

ఉత్కంఠ మధ్య బిగ్ బాస్ హౌస్ నుండి అతను అవుట్.

Published on Oct 14, 2019 7:27 AM IST

ఎట్టకేలకు ఊహాగానాలకు, పుకార్లకు తెరదించుతూ బిగ్ బాస్ ఎలిమినేషన్ జరిగిపోయింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఎలిమినేషన్ లో మహేష్ విట్టా ను బట్టలు సర్దుకోమని నాగార్జున చెప్పడంతో, మహేష్ ఈవారం ఎలిమినేట్ అయినట్లు తెలిసిపోయింది. దీనితో హీరో వరుణ్ సందేశ్, రాహుల్ సేఫ్ కావడంతో వారిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. మొదటి నుండి ఈ వారం మహేష్ ఎలిమినేట్ కానున్నారంటూ సోషల్ మాధ్యమాలలో విపరీతంగా ప్రచారం జరిగింది. కానీ టఫ్ కాంపిటీషన్ మధ్య ఈసారి ఉహలకతీతంగా ఎలిమినేషన్ ఉండవచ్చని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.

మహేష్ ఎలిమినేషన్ తో ఇక బిగ్ బాస్ హౌస్ లో కేవలం ఏడుగురు మాత్రమే మిగిలారు. శ్రీ ముఖి, వరుణ్, వితిక, బాబా భాస్కర్, రాహుల్, శివ జ్యోతి, అలీ రెజా హౌస్ లో కొనసాగుతున్నారు. ఇంకా కేవలం కిద్దిరోజులలో బిగ్ బాస్ 3 ముగియనుండటంతో షో మరింత రసవత్తరంగా సాగనుంది.ఫైనల్ కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసే విషయంలో బిగ్ బాస్ టాస్క్ లు మరింత కఠినంగా, ఆసక్తికరంగా ఉండొచ్చు. ఇక నేడు సోమవారం కావడంతో వచ్చే వారం ఎలిమినేషన్స్ కొరకు నామినేషన్స్ జరుగుతాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు