మోస్ట్ అవైటెడ్ సిరీస్ ను మొత్తానికి తెలుగులో తీసుకొచ్చారు.!

mirzapur series 2

ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ఓటిటి ప్లాట్ ఫామ్ ఏలుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వచ్చిన లాక్ డౌన్ లో అయితే అసలే పాపులారిటీ సంతరించుకుంది. అయితే ఈ ఓటిటిలో ప్రసారం అయ్యే వెబ్ సిరీస్ ల కోసం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలా మన ఇండియాలో కూడా పలు వెబ్ సిరీస్ లకు భారీ ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు.

కానీ “మీర్జాపూర్” సిరీస్ కు అయితే మాస్ లో ఉన్న ఫాలోయింగే వేరే లెవెల్. అదొక్కటేనా మన తెలుగులో అయితే మరింత స్థాయిలో ఉన్నారు. అయితే ఈ సిరీస్ కు సంబంధించి సీజన్ 2 కొన్ని నెలల కిందటే రిలీజ్ కాగా దానిని తెలుగు డబ్బింగ్ లో విడుదల చేయకపోవడంతో నెటిజన్స్ అమెజాన్ ప్రైమ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు..

వారి నుంచి ఒక పోస్ట్ పడితే 80 శాతానికి పైగా తెలుగు వారి కామెంట్లే అధికంగా ఉండేవి దీనిని బట్టే ఈ సీజన్ ఎంత మోస్ట్ అవైటెడ్ గా నిలిచిందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్ గా ఈ సీజన్ ను కూడా తెలుగులో కూడా అందుబాటులోకి తెచ్చేసారు. దీనితో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తెలుగు ఆడియెన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Exit mobile version