బాలయ్య మళ్లీ యాక్షన్ తోనే మొదలెట్టాడు !

బాలయ్య మళ్లీ యాక్షన్ తోనే మొదలెట్టాడు !

Published on Mar 2, 2020 11:02 AM IST

బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఉదయం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో యాక్షన్ ఎపిసోడ్ తో చిత్రబృందం షూట్ ను ప్రారంభించింది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా అంజలిని ఫైనల్ చేసింది టీం. అలాగే శ్రియా సరన్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలనుకుంటున్నారట.

కాగా ఈ సినిమాలో బాలయ్య డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే గుండుతో పాటు ఫుల్ మీసంతో ఉన్న ఫోటో బాగా వైరల్ అయ్యాయి. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు