మొత్తానికి నితిన్ మరో కొత్త సినిమా.. రెండో వారం నుంచే మొదలు!

మొత్తానికి నితిన్ మరో కొత్త సినిమా.. రెండో వారం నుంచే మొదలు!

Published on May 6, 2026 3:00 PM IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తన గత చిత్రం తమ్ముడు డిజప్పాయింట్ చేయడంతో నెక్స్ట్ సినిమాల కోసం అభిమానులు ఎదురు చూడడం మధ్యలో నితిన్ పలు సినిమాలు వదిలేయడం కూడా జరిగిపోయాయి. అయితే ఫైనల్ గా నితిన్ నుంచి ఈ ఏడాదిలో రెండో కొత్త సినిమా ఇప్పుడు అధికారికంగా ముహూర్త కార్యక్రమాలతో లాంఛ్ అయ్యింది.

నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా సోమశేఖర్, నారి సిరిస్వాద అనే కొత్త దర్శకులతో నేడు మేకర్స్ ముహూర్త కార్యక్రమాలతో సినిమాని లాంచ్ చేసిన ఫోటోలు ఇపుడు వైరల్ గా మారాయి. అంతే కాకుండా యంగ్ హీరోయిన్ రితికా నాయక్ కూడా ఇందులో పాల్గొనడంతో హీరోయిన్ ఎవరు అనేది కూడా తేలిపోయింది. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ మే రెండో వారం నుంచే పట్టాలెక్కిననున్నట్టు కూడా ఖరారు చేశారు. మరి ఇంత గ్యాప్ తర్వాత నితిన్ ఎలాంటి ట్రీట్ అందిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు