ఫైనల్ గా ‘దేవర’ శాటిలైట్ సస్పెన్స్ కి తెర.. ఆ ఛానెల్ కి హక్కులు!

devara-2

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ చిత్రమే “దేవర”. ఎన్టీఆర్ కి భారీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం థియేటర్స్ లో ఓటిటిలో బాగానే రాణించింది కానీ ఇన్నేళ్ల గ్యాప్ లో ఇంకా టీవీ ప్రీమియర్ కి మాత్రం నోచుకోలేదు. పైగా సినిమా శాటిలైట్ హక్కులు ఇంకా టాలీవుడ్ లో పెద్ద సస్పెన్స్ గా మారింది.

అయితే ఫైనల్ గా ఈ సస్పెన్స్ కి తెర పడింది. ప్రముఖ టీవీ ఛానెల్ ఈటీవీ వారు దేవర శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్నారు. సో అతి త్వరలోనే దేవర వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ని ఇందులో ఆశించవచ్చు. ఏదైనా స్పెషల్ పండుగ రోజున ప్లాన్ చేసుకుంటే సినిమాకి మంచి టీఆర్పీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు. అలాగే పార్ట్ 2 ప్రస్తుతానికి అయ్యితే హోల్డ్ లోనే కొనసాగుతుంది.

Exit mobile version