ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “పొలిమేర 2”..కానీ

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “పొలిమేర 2”..కానీ

Published on Dec 7, 2023 8:00 AM IST

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యం రాజేష్ మెయిన్ లీడ్ లో నటించిన రీసెంట్ చిత్రం “మా ఊరి పొలిమేర 2” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు డాక్టర్ అనీల్ విశ్వనాధ్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా థియేటర్స్ లో పెద్ద హిట్ అయ్యింది. మరి మొదటి భాగం ఓటిటిలోనే వచ్చినప్పటికీ నెక్స్ట్ సినిమా థియేటర్స్ లో మేకర్స్ రిలీజ్ చేసి పెద్ద సక్సెస్ ని అందుకున్నారు.

మరి థియేట్రికల్ సక్సెస్ అనంతరం ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ గా ఓటిటిలో అయితే వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు కొనుగోలు చేయగా అందులో ఈ సినిమా ఈరోజు నుంచి వచ్చింది. కానీ మొదట అయితే ఆహా గోల్డ్ సభ్యులకి మాత్రమే ఇప్పుడు ఈ చిత్రం అందుబాటులో ఉంది. రేపు నవంబర్ 8 నుంచి అయితే ఈ చిత్రం ఆహా సాధారణ సబ్ స్క్రిప్షన్ ఉన్నవారికి స్ట్రీమింగ్ కి రానుంది. మరి ఆహా గోల్డ్ ఉన్నవారు అయితే ఈరోజు నుంచే ఈ సినిమా చూడవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు