మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ లో నాగవంశీ కూడా ఒకరు. తన సితార బ్యానర్ పై ఎన్నో సినిమాలు తెలుగు ఆడియెన్స్ కి తాను అందించారు. గత ఏడాదిలో పలు సినిమాలు నిర్మాణం సహా డిస్ట్రిబ్యూషన్ కి కూడా తాను తీసుకొచ్చారు. అయితే తనకి ఒక్క సరైన హిట్ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు.
అయితే ఫైనల్ గా ఈ సంక్రాంతికి వచ్చిన లేటెస్ట్ చిత్రం అనగనగా ఒక రాజు తో ఆ ఫీట్ సాధ్యం అయ్యినట్టు తెలిపారు. మొత్తం 10 నెలలు తర్వాత తాను పాజిటివ్ రిపోర్ట్స్ యూఎస్ మార్కెట్ నుంచి వింటున్నాను అని తన అందాన్ని ఈ సినిమాతో వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి నటించగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. అలాగే సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ దగ్గర మంచి బజ్ తో ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చింది.
Finally some good news after 10 months ????❤️
Blockbuster response from early shows & US premieres… #AnaganagaOkaRaju in theatres near you… ❤️????
— Naga Vamsi (@vamsi84) January 14, 2026
