వరల్డ్స్ అవైటెడ్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్స్ వచ్చేసాయి.!

Published on May 25, 2021 7:09 am IST

ఒక్క మన దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా యూనానిమస్ హిట్ కాబడిన వెబ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది “మనీ హెయిస్ట్” సిరీస్ అనే చెప్తారు అందరూ.. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ స్పానిష్ సిరీస్ ఇప్పటి వరకు నాలుగు సీసన్స్ కంప్లీట్ చేసుకుని ఐదవ సీసన్ షూట్ ని ఇటీవలే కంప్లీట్ చేసుకుంది.

దీనితో దీని రిలీజ్ డేట్ కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. ఈ ఫైనల్ సీసన్ ను మేకర్స్ ఒక్కటిగా కాకుండా రెండు పార్టులుగా విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ రెండు భాగాల విడుదల తేదీలు కూడా ప్రకటించేశారు.

మరి సీసన్ 5 పార్ట్ 1 వచ్చే సెప్టెంబర్ 3 న విడుదల చేయనుండగా పార్ట్ 2 డిసెంబర్ 3 న ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ కు తీసుకురావడం ఫిక్స్ చేశారు. సో “లకాసా డి పాపెల్” ఫ్యాన్స్ అదే.. “మనీ హెయిస్ట్” లవర్స్ ఈ సెన్సేషనల్ హిట్ సిరీస్ ఫైనల్ సీసన్ డబుల్ ట్రీట్ కోసం అప్పటి వరకు ఆగాల్సిందే..

సంబంధిత సమాచారం :