టాక్..ఫైనల్ గా “అయలాన్” తెలుగు స్ట్రీమింగ్ డేట్ లాక్?

టాక్..ఫైనల్ గా “అయలాన్” తెలుగు స్ట్రీమింగ్ డేట్ లాక్?

Published on Apr 3, 2024 3:31 PM IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా దర్శకుడు ఆర్ రవికుమార్ తెరకెక్కించిన భారీ సైన్స్ ఫిక్షన్ డ్రామా “అయలాన్”. మరి ముందు నుంచి కూడా తమిళ్ సహా తెలుగు ఆడియెన్స్ లో మంచి ఆసక్తి రేపిన ఈ చిత్రం తెలుగులో మాత్రం విడుదలకి నోచుకోలేదు. ప్రీ రిలీజ్ వేడుకని కూడా జరుపుకుంది కానీ అనుకోని విధంగా సినిమా నిలిచిపోయింది. పోనీ ఓటిటిలో అయినా చూద్దామంటే ఆ ఊసు కూడా ఈ సినిమా పట్ల లేదు.

కానీ ఈ లోపే తమిళ్ లో సన్ నెక్స్ట్ లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఫైనల్ గా తెలుగు ఓటిటి రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం ఈ ఏప్రిల్ 19 నుంచి అందుబాటులోకి రానుంది అని వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో యోగిబాబు తదితరులు నటించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే కే జే ఆర్ స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు