ఫైనల్ గా “ది బాయ్స్” సీజన్ 4 రిలీజ్ డేట్ ఫిక్స్.!

ఫైనల్ గా “ది బాయ్స్” సీజన్ 4 రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Feb 23, 2024 7:59 AM IST

ప్రపంచ ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలో అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఒకటి. మరి ప్రైమ్ వీడియోలో గ్లోబల్ గా హిట్ అయ్యిన పలు వెబ్ షోస్ లో సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ సిరీస్ “ది బాయ్స్” కూడా ఒకటి. మరి ఇండియాలో మంచి మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ సిరీస్ లో సీజన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ సీజన్ తాలూకా రిలీజ్ డేట్ ని అయితే ప్రైమ్ వీడియో వారు ఫైనల్ గా రివీల్ చేసేసారు.

దీనితో ఈ అవైటెడ్ సీజన్ ఈ ఏడాది జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ది బాయ్స్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి బిల్లీ బుచర్, హోమ్ లాండర్ నడుమ ఈసారి ఎలాంటి యుద్ధం ఉంటుందో అని ఎగ్జైటెడ్ గా ఉన్న ఫ్యాన్స్ అపుడు వరకు ఆగాల్సిందే మరి. ఇక గత ఏడాదిలో ఈ బాయ్స్ సిరీస్ కి అనుబంధంగా “జెన్ వి” అనే కొత్త సిరీస్ తో యంగ్ సూపర్ హీరోస్ ని పరిచయం చేసారు. మరి రెండిటికి కూడా లింకప్ ఉన్నట్టు చూపించారు. ఇక ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు