ఫైనల్ గా ఆ ఓటిటి ప్లాట్ ఫామ్ లో ‘సలార్’ హిందీ వర్షన్

ఫైనల్ గా ఆ ఓటిటి ప్లాట్ ఫామ్ లో ‘సలార్’ హిందీ వర్షన్

Published on Feb 16, 2024 1:06 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో విజయ్ కిరగందూర్ నిర్మించారు. థియేటర్స్ లో అదరగొట్టిన ఈ మూవీ ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది.

అయితే నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే ఈ మూవీ అందుబాటులో ఉండడంతో హిందీ వర్షన్ రిలీజ్ పై ఫ్యాన్స్, ఆడియన్స్ ఉత్సాహంగా ఎదురుచూడ సాగారు. మొత్తంగా అయితే నేడు కొద్దిసేపటి క్రితం మరొక ఓటిటి మాధ్యమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సలార్ హిందీ డబ్బింగ్ వర్షన్ అయితే అందుబాటులోకి వచ్చింది. మరి దీనికి ఆడియన్స్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ మూవీకి భువన గౌడ ఫోటోగ్రఫి అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు