మొత్తానికి పవన్ “ఓజి” మొదలయ్యేది అప్పుడే!?

మొత్తానికి పవన్ “ఓజి” మొదలయ్యేది అప్పుడే!?

Published on May 17, 2024 4:04 PM IST


రానున్న రోజుల్లో మన టాలీవుడ్ నుంచి అంతా ఎదురు చూస్తున్న పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో చేస్తున్న పవర్ఫుల్ యాక్షన్ చిత్రం “ఓజి” (They Call Him OG) కూడా ఒకటి. పవన్ కెరీర్ లో సాలిడ్ హైప్ ని తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు పవన్ ఎన్నికల మూలాన ఇచ్చిన గ్యాప్ లో నిరవధికంగా కొన్నాళ్ల పాటు ఆగాల్సి వచ్చింది.

అయితే మళ్ళీ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీనిపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం ఇది వరకు మేము చెప్పినట్టుగానే ఆలస్యంగానే మొదలు కానుందట. జూన్ నెలాఖరు అలా పవన్ డేట్స్ ఇచ్చినట్టుగా ఇప్పుడు వినిపిస్తుంది. దీనితో ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు వచ్చిన తర్వాతే ఓజి మళ్ళీ రీస్టార్ట్ కానుంది అని చెప్పాలి.

అయితే ఈ సినిమాకి ఇంకా పవన్ కేవలం 15 రోజులు అలా మాత్రమే పని చేయాల్సి ఉందని టాక్. ఈ డేట్స్ కోసమే మేకర్స్ ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి అయితే ఇది జూన్, జూలై నాటికి సాధ్యపడనుంది అని చెప్పవచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు