ఫైనల్ గా “వ్యూహం” కి సెన్సార్ పూర్తి.. రన్ టైం లాక్డ్

ఫైనల్ గా “వ్యూహం” కి సెన్సార్ పూర్తి.. రన్ టైం లాక్డ్

Published on Feb 28, 2024 2:09 PM IST

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పలు పొలిటికల్ రిలేటెడ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలా ఎప్పుడు నుంచో రిలీజ్ కి రావాల్సిన చిత్రం “వ్యూహం” ఇంకా వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వస్తుంది. అలాగే ఇంకో పక్క ఈ చిత్రాన్ని సెన్సార్ చేయడానికి కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయని ఆ మధ్య కొన్ని కాంట్రవర్సీలు కూడా వచ్చాయి. అయితే ఫైనల్ గా ఈ కాంట్రవర్సీకి వర్మ చెక్ పెట్టాడు.

ఈ మార్చ్ 2న రిలీజ్ కాబోతున్న వ్యూహం చిత్రానికి సెన్సార్ కంప్లీట్ అయ్యినట్టుగా సెన్సార్ సర్టిఫికెట్ తో రివీల్ చేసాడు. పట్టు వదలని విక్రమార్కున్ని అంటూ తనని తానే హైలైట్ చేసుకుని సర్టిఫికెట్ పేపర్ తో అయితే పోస్ట్ చేసాడు. మరి ఈ చిత్రానికి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందించగా ఈ చిత్రం మొత్తం 121 నిమిషాల 37 సెకండ్లు ఉన్నట్టుగా ఇందులో కనిపిస్తుంది. మొత్తానికి అయితే తన పంతం నెగ్గించుకొని ఈ మార్చ్ 2న వ్యూహం రిలీజ్ చేస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు