ఓటిటి : ఫైనల్ గా ప్రపంచం ఎదురు చూస్తున్న “గాడ్జిల్లా -1” కి డేట్ ఫిక్స్

ఓటిటి : ఫైనల్ గా ప్రపంచం ఎదురు చూస్తున్న “గాడ్జిల్లా -1” కి డేట్ ఫిక్స్

Published on Apr 16, 2024 3:04 PM IST


ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ లో మెరిసిన పలు చిత్రాల్లో జపాన్ నుంచి వచ్చిన సెన్సేషనల్ చిత్రం “గాడ్జిల్లా -1” (Godzilla Minus 1) కూడా ఒకటి. స్పెషల్ ఎఫెక్ట్స్ జాబితాలో ఈ జపాన్ చిత్రం ఆస్కార్ గెలిచి అదరగొట్టింది. మరి దర్శకుడు తకాషి యమాజాకి తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 1న జపాన్ లో రిలీజ్ అయ్యి భారీ హిట్ కాగా అక్కడ నుంచి ఈ సినిమా కోసం ప్రపంచం మాట్లాడుకోవడం మొదలు పెట్టింది.

మరో పక్క హాలీవుడ్ నుంచి “గాడ్జిల్లా అండ్ కాంగ్ న్యూ ఎంపైర్” లాంటి సినిమా కూడా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ జపాన్ వెర్షన్ గాడ్జిల్లా కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనితో ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై కూడా ఎలాంటి అప్డేట్ కూడా లేకపోవడంతో మరింత సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా డేట్ వచ్చేసింది.

ఈ సినిమాని ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఇందులో ఈ మే 3న స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా ప్రైమ్ వీడియో వారు అనౌన్స్ చేయగా ఇది ఒక్కసారిగా వైరల్ అయ్యిపోయింది. అయితే ఇక్కడ డిజప్పాయింటింగ్ అంశం ఏమిటంటే ఇది కేవలం జాపనీస్ లో మాత్రమే రానుంది. ఇంగ్లీష్ కానీ ఇతర భాషల్లో అయితే ఏమి ప్రైమ్ వీడియో వారు అప్డేట్ చేయలేదు. కానీ ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న వారికి మాత్రం ఇది పెద్ద న్యూస్ అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు