నితిన్ భీష్మ నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో

నితిన్ భీష్మ నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో

Published on Nov 5, 2019 8:05 PM IST

Bheeshma

హీరో నితిన్ దాదాపు ఏడాది విరామం తరువాత దర్శకుడు వెంకీ కుడుములు డైరెక్షన్ లో భీష్మ చిత్రాన్ని ప్రారంభించారు.ఆయన నటించిన శ్రీనివాస కళ్యాణం మూవీ గత ఏడాది ఆగస్టులో విడుదల కావడం జరిగింది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న బీష్మ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. యంగ్ లేడీ రష్మిక మందాన మొదటిసారి నితిన్ తో ఈ చిత్రంలో జతకడుతుంది. కాగా ఈ నెల7న నితిన్ ఫ్యాన్స్ కొరకు చిత్ర యూనిట్ గిఫ్ట్ సిద్ధం చేశారు. భీష్మ చిత్రం నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ఆ రోజు ఉదయం 10:00 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేసి తెలియజేశారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మహంతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇక నితిన్ ఈ ఏడాది వరుసగా భీష్మ చిత్రంతోపాటు నాలుగు చిత్రాలు ప్రకటించారు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్న నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రం చేస్తున్నారు. ఇవికాక కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో మూవీ నితిన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా నితిన్ వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు