ఫస్ట్ గ్లింప్స్ తో ‘ప్రతి రోజు పండగే’ !

ఫస్ట్ గ్లింప్స్ తో ‘ప్రతి రోజు పండగే’ !

Published on Oct 15, 2019 6:26 PM IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “ప్రతి రోజు పండగే”. కాగా ఈ రోజు సాయి తేజ్ పుట్టినరోజు కావడంతో ఈ చిత్రం నుండి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ఫస్ట్ గ్లింప్స్ లవ్లీగా వేరు కలర్ ఫుల్ గా ఉంది. ముఖ్యంగా ఫీల్ గుడ్ మ్యూజిక్ తో పాటు డీసెంట్ విజువల్స్ బాగుండటంతో ఈ ఫస్ట్ గ్లింప్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ ను అలాగే పల్లెటూరి నేపథ్యాన్ని కూడా బాగా ఎలివేట్ చేసారు. ఇక క్రిష్టమస్ సందర్భంగా డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

“ప్రతి రోజు పండగే” చిత్రంలో ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ “సుప్రీం” సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి తదితరులు నటిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు