రెబల్ స్టార్ ప్రభాస్ సైన్ చేసిన చిత్రాల్లో బాలీవుడ్ చిత్రం ‘ఆదిపురుష్’ కూడ ఒకటి. ఈ సినిమా కోసం ప్రభాస్ ఇప్పటి నుండే సన్నద్దమవుతున్నారు. సన్నబడి కొత్త లుక్ ట్రై చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ చేస్తున్న డైరెక్ట్ హిందీ చిత్రం ఇదే కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అసలు ప్రభాస్ రాముడి గెటప్లో ఎలా ఉంటారో చూడాలని తెగ ఉబలాటపడుతున్నారు. ఇప్పటివరకు ఏదో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు చూడటమే తప్ప అసలు లుక్ చూడలేదు.
షూటింగ్ స్పాట్ నుండి పిక్స్ కూడ బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. దీంతో రాముడి అవతారంలో తమ హీరోను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్సీ. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. అది కూడ ఏప్రిల్ 21న శ్రీరామనవమి పర్వదినం రోజున చేస్తారని అంటున్నారు. అదే గనుక నిజమైతే డార్లింగ్ అభిమానులకు పండుగే అనాలి. ఓం రౌత్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో కృతి సనన్ కథానాయకిగా చేస్తుండగా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు.

