విడుదలైన “రొమాన్స్” ఫస్ట్ లుక్

విడుదలైన “రొమాన్స్” ఫస్ట్ లుక్

Published on Feb 14, 2013 4:20 PM IST

Romance
వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు రామానాయుడు స్టుడియోలో త్వరలో విడుదల కాబోతున్న ‘రొమాన్స్’ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీసర్ ను విడుదల చేసారు. ‘నీకూ నాకూ డాష్ డాష్’, ‘బస్ స్టాప్’ చిత్రాలలో నటించిన ప్రిన్స్ ఈ సినిమాకి కథానాయకుడు. డింపుల్ చొప్డా మరియు మానసా ఈ సినిమా ద్వారా హీరోయిన్స్ గా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ‘డార్లింగ్’, ‘రెబెల్’ సినిమాలకు మాటలు అందించిన స్వామీ ఈ చిత్రంతో డైరెక్టర్ గా మారనున్నాడు.

‘ఈ రోజుల్లో’ చిత్ర నిర్మాతలు ఎస్.కె.ఎన్ మరియు జి.శ్రీనివాస్ రావు గుడ్ సినిమా గ్రూప్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మారుతి సమర్పకుడు కాగా ఇప్పటికే 70శాతం చిత్రీకరణ పూర్తి అయిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించగా, ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది.

రొమాన్స్ ఫస్ట్ లుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు