యువ హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న తాజా చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’. కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను కరుణాకరన్ డైరెక్ట్ చేస్తున్నారు. జూన్ 29న ఈ సినిమా విడుదలకానుండటంతో ప్రమోషన్లు మొదలుపెట్టారు చిత్ర యూనిట్. ఇప్పటికే టీజర్ ను విడుదలచేసిన టీమ్ ఇకపై పాటలతో అలరించనున్నారు.
రేపు 2వ తేదీ సాయంత్రం ఏడున్నర గంటలకు ఆల్బమ్ లోని మొదటి పాట ‘అందమైన చందమామ’ను విడుదలచేయనున్నారు. షూటింగ్ మొత్తం ముగించుకున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయకిగా నటిస్తోంది. ఇకపోతే తేజ్ చేతిలో ఇంకో రెండు కొత్త సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.


