పవన్ పింక్ రీమేక్ నుండి ఫస్ట్ సాంగ్..!

Published on Feb 24, 2020 4:09 pm IST

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత చేస్తున్న మొదటి చిత్రం పింక్ రీమేక్. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మే నెలలో విడుదల కానుంది. ఈ చిత్రం లో మొదటిసారి పవన్ లాయర్ గా కనిపించనున్నారు. లాయర్ సాబ్, వకీల్ సాబ్ అనే టైటిల్స్ పరిగణలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ చిత్రం నుండి మొదటి అప్డేట్ రానుంది.

ఈ చిత్రంలోని మొదటి సింగిల్ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న థమన్ దీనిపై హింట్ ఇచ్చారు. ఎంతో శ్రమతో, శ్రద్దగా పాటలు చేస్తున్నాను త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నాం అని ట్విట్టర్ వేదికగా తమన్ స్పందించారు. ఈ ట్వీట్ పవన్ పింక్ సినిమా గురించే అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.

సంబంధిత సమాచారం :