విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ వచ్చే నెల 14న వాలంటైన్స్ డే కానుకగా విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. రాశి ఖన్నా, క్యాథెరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్లా నలుగురు హీరోయిన్స్ ఈ చిత్రంలో నటిస్తుండగా ఈ నలుగురి ప్రేమికుడిగా విజయ్ కనిపిస్తున్నారు. వివిధ గెటప్స్, నేపధ్యాలు కలిగి ఉన్న విజయ్ రోల్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా ఉంది. కాగా హీరోయిన్ రాశి ఖన్నా కొంచెం బోల్డ్ రోల్ చేసినట్టు టీజర్ చూస్తే అర్థం అవుతుంది.
కాగా ఈనెల 20 సాయంత్రం 4:05 నిమిషాలకు వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. మై లవ్ అనే ఈ సాంగ్ వరల్డ్ ఫేమస్ లవర్ నుండి వస్తున్న ఫస్ట్ సింగిల్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా గోపి సుందర్ ఈ చిత్రానికి సాంగ్స్ అందిస్తున్నారు.