ఆకట్టుకుంటున్న “భారతీయుడు 2” ఫస్ట్ సింగిల్!

ఆకట్టుకుంటున్న “భారతీయుడు 2” ఫస్ట్ సింగిల్!

Published on May 22, 2024 6:52 PM IST


యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ భారతీయుడు 2. ఈ చిత్రం మొదటి పార్ట్ అయిన భారతీయుడు కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రం ను జూలై 12, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ సింగిల్ ను నేడు రిలీజ్ చేయడం జరిగింది.

ఫస్ట్ సింగిల్ చాలా పవర్ ఫుల్ గా సాగింది. ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవి చందర్ సాలిడ్ మ్యూజిక్ అందించారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, ఎస్.జే సూర్య, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు