న్యాచురల్ స్టార్ నాని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని మొదటి సింగిల్ ‘ఆయా షేర్’ త్వరలోనే విడుదల కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మాస్ డ్యాన్స్ నంబర్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్పుడే రచ్చ మొదలుపెట్టారు.
ప్రస్తుతం ఈ పాట విడుదల తేదీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలను చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనుంది. అలాగే, సినిమా కొత్త విడుదల తేదీని కూడా త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మోహన్ బాబు, సోనాలి కుల్కర్ణి, బాబు మోహన్ మరియు తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.


