“సరిపోదా శనివారం” నుండి గరం గరం సాంగ్ రిలీజ్ కి రెడీ!

“సరిపోదా శనివారం” నుండి గరం గరం సాంగ్ రిలీజ్ కి రెడీ!

Published on Jun 11, 2024 6:00 PM IST

నేచురల్ స్టార్ నాని మరోసారి వివేక్ ఆత్రేయతో జతకట్టాడు. వారి మొదటి చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికి. వారి రెండవ చిత్రం సరిపోదా శనివారం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కి సంబందించిన మ్యూజికల్ ప్రమోషన్స్ ను మేకర్స్ స్టార్ట్ చేయడం జరిగింది.

మొదటి పాటను ఈ శనివారం రోజున విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గరం గరం అంటూ సాగే ఈ పాట ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అయిపోయింది. మేకర్స్ ఫస్ట్ సింగిల్ ను అనౌన్స్ చేయడానికి పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో నాని లుక్ అభిమానులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తుండగా, ఎస్‌జే సూర్య, సాయికుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూరుస్తున్నారు. సరిపోదా శనివారం చిత్రం ఆగస్ట్ 29, 2024న భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు