అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’.ఆట గదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న’మిస్ మ్యాచ్’ విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికెట్ ను పొందింది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న ‘మిస్ మ్యాచ్’ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు ఇటీవలే మీడియాకు అధికారికంగా ప్రకటించారు.
‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని ‘అరెరే అరెరే…’ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ నేడు విడుదల చేశారు. ఈ సందర్బంగా డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ…”మిస్ మ్యాచ్’ టైటిల్ కొత్తగానూ,ఆసక్తిని కలిగించేదిగానూ ఉంది. డైరెక్టర్ నిర్మల్ తీసిన ‘సలీమ్’ సినిమా తమిళ్, తెలుగులో మంచి విజయం సాధించింది. తెలుగులో అతను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్న ‘మిస్ మ్యాచ్’ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. చిత్ర యూనిట్ కు గుడ్ లక్. ‘మిస్ మ్యాచ్’ ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్ కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. ఇప్పుడు రిలీజ్ అయిన ‘అరెరే అరెరే’ మెలోడీ సాంగ్, వినాలనిపించేదిగా ఉంది” అన్నారు. సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గిఫ్టన్ ఇలియాస్ సంగీతం అందిస్తున్నారు.


