న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైన తొలి తెలుగు చిత్రం !

న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైన తొలి తెలుగు చిత్రం !

Published on Apr 3, 2018 2:41 PM IST

విడుదలకు ముందే కొన్ని సినిమాలు విపరీతమైన పాజిటివ్ క్రేజ్ ను సొంతం చేసుకుంటుంటాయి. అలాంటి సినిమాల్లో ‘కేరాఫ్ కంచరపాలెం’ కూడ ఒకటి. వెంకట్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను హైదరాబద్లో కొందరు సినీ ప్రముఖులకు స్పెషల్ షోలు వేశారు. సినిమా చూసిన వారంతా చిత్రం చాలా కొత్తగా, భిన్నంగా ఉందని మెచ్చుకున్నారు.

ఇప్పుడు ఈ సినిమానే న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. ఇప్పటి వరకు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైన తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. పరుచూరి ప్రవీణ ఈ సినిమాను నిర్మించగా సినిమాను వీక్షించిన రానా దగ్గుబాటి, సురేష్ బాబులు చిత్రాన్ని సమర్పించేందుకు ముందుకువచ్చారు. మరి ఇంతలా ప్రశంసలందుకుంటున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి.

తాజా వార్తలు