“బిగ్ బాస్ 4” హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ..అతనే?

“బిగ్ బాస్ 4” హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ..అతనే?

Published on Sep 13, 2020 5:46 PM IST

big boss4

తెలుగు సెన్సేషనల్ బిగ్గెస్ట్ గ్రాండ్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ నాలుగో సీజన్లోకి అడుగు పెట్టి అప్పుడే వారం రోజులను పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ ఆదివారం మొదటి ఎలిమినేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఈ వారం ఎలిమినేషన్ కన్ఫర్మ్ అవ్వడమే కాకుండా ఒక మేల్ కంటెస్టెంట్ బయటకు వస్తున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అలాగే లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ను కూడా బిగ్ బాస్ యాజమాన్యం అప్పుడే దింపేశారు.

ఈసారి సీజన్ కు స్టార్టింగ్ లోనే అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడం వలనే అప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అస్త్రాన్ని వినియోగించినట్టు తెలుస్తుంది. అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక మేల్ కంటెస్టెంట్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతున్నట్టుగా లేటెస్ట్ ప్రోమో ద్వారా ఈ షో హోస్ట్ కింగ్ నాగ్ కన్ఫర్మ్ చేసేసారు. అయితే అతను ఇంతకు ముందు వచ్చిన బజ్ ప్రకారమే “ఈరోజుల్లో” ఫేమ్ సాయి కుమార్ వెళ్తున్నట్టు టాక్. మరి అతనేనా కాదా అన్నది తెలియాలి అంటే ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు