‘వకీల్ సాబ్’ కిక్ అంతా ఫ్లాష్ బ్యాక్‌లోనే ఉంటుందట

‘వకీల్ సాబ్’ కిక్ అంతా ఫ్లాష్ బ్యాక్‌లోనే ఉంటుందట

Published on Apr 1, 2021 12:03 AM IST

Vakeel Saab 2

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ హిందీ చిత్రం ‘పింక్’కు తెలుగు రీమేక్ అనే సంగతి అందిరికీ తెలిసిందే. చాలామంది ‘పింక్’ సినిమాను చూసేసి ఉన్నారు కూడ. అమితాబ్ చేసిన ‘పింక్’ చిత్రం పూర్తిగా కథాపరమైన చిత్రం. అందులో హీరోయిక్ ఎలివేషన్లు, భారీ ఫైట్స్, పాటలు లాంటివి ఉండవు. అంతా ఒకటే ఎమోషన్. కానీ పవన్ లాంటి స్టార్ హీరో సినిమాను అలా ఫైట్లు, ఎలివేషన్లు, పాటలు లేకుండా నడపడం అంటే కుదరదు. అభిమానులకు సంతృప్తి ఉండదు. పైగా రీఎంట్రీ సినిమా.

అందుకే ‘వకీల్ సాబ్’ బృందం అసలు కథకు కొన్ని మసాలాలు జోడించిందట. అదే కథలో వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్. ఈ ఫ్లాష్ బ్యాక్‌లోనే హీరో క్యారెక్టరైజేషన్, సగం కథ ఇమిడి ఉంటాయట. ప్రస్తుతంలో వకీల్ సాబ్ సౌమ్యుడిగా, ప్రశాంతంగా కనబడినా ఫ్లాష్ బ్యాక్‌లో మాత్రం ఫుల్ అగ్రెసివ్, అదే అభిమానులకు కిక్ ఇచ్చే పోర్షన్, హీరోయిన్ కూడ అందులోనే ఉంటుంది. అభిమానుల్ని దృష్టిలో పెట్టుకునే ఆ భాగాన్ని రాసుకున్నారని తెలుస్తోంది. మరి అంత కిక్ ఇచ్చేలా అందులో ఏముంటుందో తెలియాలంటే ఏప్రిల్ 9 వరకు ఎదురుచూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు