ఫ్లోరా సైనీకి వస్తున్న బెదిరింపు కాల్స్

Flora-Saini
తెలుగు ప్రేక్షకులకు ‘లక్స్’పాపగా సుపరిచితురాలైన ఫ్లోరా సైనికి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది. తాను నటించిన హిందీ చిత్రం ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’సినిమాలో సూసైడ్ బాంబర్ గా కనిపించిన విధానంపై ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.

ఈ విధమైన సంఘటనలు ఎదురుపడగానే తనపై ప్రశ్నల వర్షాన్ని చీవాట్లని కురిపిస్తున్న వారికి తాను దైవత్వాన్ని నమ్ముతానని అన్ని మతాలను ఆదరిస్తానని అది కేవలం సినిమాలో ఒక పాత్ర మాత్రమేనని తెలిపింది. అయితే ఈమె ఎన్ని చెప్పినా సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారు.

వీరి తాకిడి భరించలేని ఫ్లోరా సైని ఇటువంటి వారిపై కేసు వెయ్యడానికి నిర్ణయించుకుంది. త్వరలో తగిన చర్యలు తీసుకుంటారని సమాచారం.

Exit mobile version