పవన్ ఈ రీమేక్ సినిమాకే ఎక్కువ ధర పలుకుతుందట.?

Published on Mar 3, 2021 3:01 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో రీమేక్ సినిమాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఎప్పటి నుంచో పవన్ తో పాటు పవన్ కంటే ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన తమిళ్ హీరోలే ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి కొత్త కంటెంట్ తో దూసుకుపోతున్నారు. అయినప్పటికీ పవన్ మాత్రం తన క్రేజ్ తో రీమేక్ లు చేసినా మినిమమ్ ఓపెనింగ్స్ రాబట్టేస్తున్నాడు. అలా ఇప్పుడు పవన్ చేతిలో రెండు రీమేక్ ప్రాజెక్ట్ లు ఉన్న సంగతి తెలిసిందే.

వాటిలో ఒకటి వేణు శ్రీరామ్ తెరకెక్కించిన “వకీల్ సాబ్” కాగా మరొకటి యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తీస్తున్న చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్. టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా ఇందులో పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నాడు. మరి ఈ రెండు రీమేక్ సినిమాలకు సంబంధించి బిజినెస్ లెక్కలపై టాక్ వినిపిస్తుంది.

ఓవర్సీస్ మార్కెట్ లో వకీల్ సాబ్ కంటే కూడా అయ్యప్పణం రీమేక్ కే ఎక్కువ ధర పలుకుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మొదటి నుంచీ కూడా ఈ రెండు రీమేక్స్ ఒకింత ఈ రీమేక్ పైనే అంచనాలు ఎక్కువ ఉన్నాయి సో దీని రేట్ ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పాలి. మరి ఈ రెండు సినిమాలకు కూడా థమనే సంగీతం ఇస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :