‘వారణాసి’ అప్పటికి పూర్తి.. జక్కన్న నుంచి ఇంట్రెస్టింగ్ అంశాలు!

Varanasi

ఇప్పుడు ప్రపంచ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారతీయ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మన తెలుగు సినిమా వారణాసి అని చెప్పాలి. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ గ్రాండ్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమా నుంచి మరో కంప్లీట్ ఐమాక్స్ వెర్షన్ సినిమాగా దీన్ని సగర్వంగా ప్రెజెంట్ చేస్తున్నారు.

అయితే వారణాసి సినిమాపై హాలీవుడ్ మీడియా వెరైటీ తో ఇంట్రెస్టింగ్ అంశాలు పంచుకున్నారు. వారణాసి సినిమా దాదాపు పూర్తి కావచ్చింది అని తెలిపారు. మేజర్ యాక్షన్ పార్ట్ అంతా పూర్తి చేశారట. పలు సన్నివేశాలకు ఉన్న ఇంటర్ లింక్ సీన్స్ ని ఇంకా పూర్తి చేయాల్సి ఉండగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూట్ మొత్తాన్ని ముగిస్తున్నట్టు జక్కన్న కన్ఫర్మ్ చేశారు. అలానే ఐమాక్స్ వెర్షన్ కోసం తగ్గట్టుగానే సన్నివేశాలు దేన్ని ఛేంజ్ చేయకుండా పూర్తి ఐమాక్స్ స్టయిల్ లోనే తెరకెక్కించినట్టు తెలిపారు.

Exit mobile version