ఈ శుక్రవారం బాక్సాఫీస్ బరిలో 4 సినిమాలు

ఈ శుక్రవారం బాక్సాఫీస్ బరిలో 4 సినిమాలు

Published on Nov 6, 2014 1:04 AM IST

joru-jaihind-b-of-b
సందీప్ కిషన్ ‘జోరు’, అల్లరి నరేష్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’, యాక్షన్ కింగ్ అర్జున్ ‘జైహింద్ 2’ సినిమాలు ఈ శుక్రవారం బాక్సాఫీస్ బరిలో పోటి పడుతున్నాయి. వీటితో పాటు జకార్తాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్లాటినం అవార్డు అందుకున్న ‘పరంపర’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నవంబర్ 7న తెలుగు సినిమా ప్రేక్షకులకు వినోదం అందించడానికి సిద్దమయ్యాయి.

‘జోరు’, ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. యువ హీరోలు నటించిన రొమాంటిక్ & కామెడీ ఎంటర్టైనర్స్ కావడంతో యువ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకున్నాయి. అయినా ఈ నాలుగు సినిమాల మధ్య ఆరోగ్యకరమైన పోటి నెలకొని ఉంది. ప్రతి సినిమాకు మంచి మార్కెట్ ఉంది. ఒక సినిమాతో మరొక సినిమాను కంపేర్ చేయడానికి కుదరదు. నరేష్ నటించిన ‘పరంపర’, అర్జున్ ‘జై హింద్ 2’లు సందేశాత్మక సినిమాలుగా ముద్ర పడ్డాయి. వీటికి ఓ వర్గం ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది. విడుదల తర్వాత ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమాలు నిలబెట్టుకుంటాయో..? లేదో..? వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు