లాక్ డౌన్ రివ్యూ : ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ (సీజన్ 2 అమెజాన్ ప్రైమ్)

లాక్ డౌన్ రివ్యూ : ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ (సీజన్ 2 అమెజాన్ ప్రైమ్)

Published on Apr 25, 2020 10:00 PM IST

 

 

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో నెక్స్ట్ వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్. హిందీ మరియు ఇంగ్లీష్ లో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో చూద్దాం ..

 

కథాంశం ఏమిటీ?:

ఈ వెబ్ సిరీస్ లో సెకండ్ సీజన్ గా వస్తున్న ఈ కథ సయాని గుప్తా (దామిని), బని జె (ఉమాంగ్), కృతి కులకర్ణి (అంజనా), మాన్వి గ్యాంగ్రూ (సిధి పటేల్) అనే నలుగురు అమ్మాయిల గురించి . సయాని గుప్తా ఒక రచయిత కావడంతో తన పుస్తకాన్ని ప్రచురించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది, బని జె ఒక లేడీ సూపర్ స్టార్ తో ప్రేమలో పడుతుంది, కృతి కులకర్ణి విడాకుల తరువాత మరొక పెళ్లి చేసుకోవడానికి అనువైన వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక చివరగా, మాన్వి గ్యాంగ్రూ తను పెట్టుకున్న సిద్ధాంతాలకు అనుగుణంగా జీవిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరి కథ, భిన్నమైన కోణం కలిగి ఉంటుంది. ఈ నలుగురు అమ్మాయిల కథల సమాహారమే ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్.

 

ఏమి బాగుంది:

ఆధునిక యువతుల జీవన కోణంలో తెరకెక్కిన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ లో నటించిన నలుగురు అమ్మాయిల నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా స్వేచ్ఛా జీవితం గడపాలని భావించే డైవర్స్ లేడీగా కృతి కులకర్ణి నటన బాగుంది. నలుగురు అమ్మాయిల జీవిత కోణాలు వైవిధ్యంగా ఉండగా వాటిని ముగించిన తీరు కూడా బాగుంది. ప్రతి ఎపిసోడ్ తెరకెక్కించిన తీరు ముగించిన విధానం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి.

 

చివరి మాటగా:

మొత్తంగా చెప్పాలంటే అర్బన్ ఆడియెన్స్ ని టార్గెట్ చేసి తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఆ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బోల్డ్ కంటెంట్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఎమోషన్ అండ్ రొమాన్స్ బ్లెండ్ చేసిన తీసిన ఈ వెబ్ సిరీస్ ఆహ్లాదం పంచుతుంది.

 

 

123telugu.com Rating : 3.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు