త్రివిక్రమ్ సినిమాలో నలుగురు హీరోలు ?

ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేశాడు. అయితే ఈ సినిమాలో నలుగురు సీనియర్ హీరోలు నటించబోతున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. అలాగే మరో సీనియర్ హీరో జయరామ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక మెయిన్ విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నాడు.

అలాగే రాజేంద్రప్రసాద్ కూడా హీరో ఫాదర్ గా నటిస్తున్నాడట. మొత్తానికి త్రివిక్రమ్ సినిమాలో ఈ సారి నలుగురు సీనియర్ హీరోలు కనిపించబోతున్నారు అన్నమాట. ఇక ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందట. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జులై నుండి షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు.

Exit mobile version