‘సాహో’ గురించి ‘లార్గో వించ్’ దర్శకుడు ఎమన్నాడంటే…

‘సాహో’ గురించి ‘లార్గో వించ్’ దర్శకుడు ఎమన్నాడంటే…

Published on Sep 1, 2019 11:27 PM IST

‘లార్గో వించ్’.. ‘సాహో’ చిత్రం విడుదలైన రోజు ఉదయం నుండి ఈ సినిమా పేరు విపరీతంగా ప్రస్తావనకు వస్తోంది. చాలామంది ప్రేక్షకులు, విమర్శకులు సినిమా చాలా వరకు ‘లార్గో వించ్’ను పోలి ఉందని చెప్పుకొచ్చారు. దీంతో ఆ సినిమా పేరు కాస్త సామాజిక మాధ్యమాల్లో, వెబ్ సైట్లలో విశేషంగా ప్రస్తావించబడింది. ఎంతలా అంటే నేరుగా ఆ చిత్ర దర్శకుడు జెరోమ్ సల్లో స్పందించేంతగా.

పలువురు సోషల్ మీడియాలో జెరోమ్ సల్లోను ట్యాగ్ చేసి సినిమా గురించి ప్రస్తావించడంతో తనకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రామిసింగ్ కెరీర్ ఉంటుందని అనిపిస్తోందంటూ ట్వీట్ చేసిన ఆ ఫ్రెంచ్ దర్శకుడు మరొక ట్వీట్లో ‘సాహో’ చిత్ర బృందంపై ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. గతంలో త్రివిక్రమ్, పవన్ చేసిన ‘అఙ్ఞాతవాసి’ చిత్రాన్ని గుర్తుచేసిన జెరోమ్ సల్లో ‘సాహో’ దానికంటే బ్యాడ్ అనేలా ఉంది, తెలుగు దర్శకులు నా సినిమాను కాపీ చెసేటప్పుడు జాగ్రత్తగా చేయండి అంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు