సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్.. రాజమౌళి సినిమాలను అభిమానించే ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. ‘ఛత్రపతి’, ‘అరుంధతి’, ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’.. ఇలా పలు అద్భుతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ స్టార్ సినిమాటోగ్రాఫర్, తాజాగా ఫ్రెంచ్ సినిమాటోగ్రాఫిక్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ (AFFECT) సంస్థ అందించే ఓ అరుదైన పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.
ఫ్రెంచ్ సినిమాటోగ్రాఫిక్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ సంస్థ ఇండియన్ సినిమాకు సెంథిల్ అందించిన సేవలను ప్రశంసిస్తూ రవి. కె. పోట్దర్ అవార్డును ప్రదానం చేసింది. ముంబైలో జరిగిన సంస్థ ఈవెంట్‌లో సెంథిల్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక తనకు ఈ అవార్డు రావడం పట్ల సెంథిల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అఫెక్ట్ సంస్థ తనను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో గోవింద్ నిహాలని, ఆర్.ఎమ్.రావు, రత్నవేలు తదితరులు ఈ అవార్డును పొందిన వారిలో ఉన్నారు.
