
హైదరాబాద్ లో గతకొన్ని రోజులుగా లోకనాయకుడు కమల్ హాసన్ తాజా చిత్రం ‘చీకటి రాజ్యం’ సినిమా షూటింగ్ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో స్టంట్స్ కోసం ఫ్రెంచ్ నుండి నిపుణులను తెప్పించినట్టు సమాచారం. ఈ చిత్రానికి యాక్షన్ సన్నివేశాలే ప్రధానం కానున్నాయి.
కమల్ సన్నిహితుడైన రాజేష్ ఈ చిత్రానికి దర్శకుడు. కమల్ హాసన్ ముఖ్యపాత్ర పోషించనున్నాడు. త్రిష హీరోయిన్. మధు శాలిని ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుంది. ఘిబ్రన్ సంగీత దర్శకుడు. షను సినిమాటోగ్రాఫర్. రాజ్ కమల్ ఫిలిమ్స్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తుంది.

