‘కల్కి..’ రిలీజ్ డేట్ పై కొత్త అప్ డేట్

‘కల్కి..’ రిలీజ్ డేట్ పై కొత్త అప్ డేట్

Published on Apr 15, 2024 11:57 AM IST


నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2898 AD’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. కల్కి సినిమాని మొదట మే 9న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఐతే, ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ నెలలో రిలీజ్ అనుకున్నారు. అది కూడా కుదరలేదు. ఇప్పుడు, తాజాగా మరో రిలీజ్ డేట్ వినిపిస్తోంది. తాజా అప్ డేట్ ప్రకారం, జూలై 2వ వారంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట. శ్రీరామ నవమి రోజున అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని టాక్.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే,ఈ భారీ-బడ్జెట్ సినిమాలో కమల్ హాసన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు