‘అఖండ 2’ పై కొత్త అప్ డేట్

‘అఖండ 2’ పై కొత్త అప్ డేట్

Published on May 25, 2024 4:00 PM IST

‘అఖండ 2’ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. అయితే, ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పై తాజాగా ఓ అప్ డేట్ వినిపిస్తోంది. ఫస్ట్ డ్రాప్ట్ స్క్రిప్టు పూర్తి అయ్యింది అని, బోయపాటి శ్రీను ప్రస్తుతం తన రైటింగ్ టీమ్ తో బెటర్ మెంట్స్ కోసం కసరత్తులు చేస్తున్నాడని తెలుస్తోంది. పాటల రచయిత కళ్యాణ్ చక్రవర్తి కూడా ఈ సినిమా స్క్రిప్ట్ టీమ్ లో వర్క్ చేస్తున్నారట. ఇక రెండు నెలల తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు.

అఖండ 2 కోసం అరకు, కొచ్చి లాంటి ప్రదేశాల్లో కొన్ని అద్భుతమైన లోకేషన్స్‌ను మూవీ యూనిట్ పరిశీలించిందట. ఇక కథ ప్రకారం.. సినిమా పూర్తిగా శైవత్వం పై సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అనే కోణంలో సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే..హిందూ దేవాలయాలకు సంబదించిన లింక్స్ తో పాటు దక్షిణ భారత దేశం గొప్పతనాన్ని కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు