స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం ‘మాస్టర్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో విజయ్ బాక్సాఫీస్ స్టామినా మరోసారి ప్రూవ్ అయింది. తమిళంలోనే కాదు తెలుగులో కూడ సినిమా మంచి సక్సెస్ సాధించింది. తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు లాభాల్ని అందించింది. విజయ్ తన తర్వాతి సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈరోజే చెన్నైలో షూటింగ్ పనులు మొదలయ్యాయి. తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక షూటింగ్ పూర్తిస్థాయిలో మొదలవుతుంది.
ఇక విజయ్ సినిమా అంటే ముందుగా గుర్తిచే మాట విలన్ ఎవరు అని. ‘మాస్టర్’ సినిమాలో విజయ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర చేయడంతో సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పండింది. ఎందుకంటే అది పూర్తిగా కొత్త కాంబినేషన్ కాబట్టి. అప్పటివరకు విజయ్ సినిమాలో అంతటి క్రేజ్ ఉన్న విలన్ నటించింది లేదు. అందుకే ఈసారి కూడ అలాంటి థ్రిల్ ఉండాలనే దర్శక నిర్మాతలు కొత్త విలన్లను తీసుకొస్తున్నారట. ఇప్పటివరకు ప్రతినాయకుడి పాత్రలు వేయని వారితోనే ఈ పాత్రలు చేయిస్తారట. మరి ఆ నటులు ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


